గలీజ్ నీళ్లు ఎట్ల తాగాలి?

గలీజ్  నీళ్లు ఎట్ల తాగాలి?

గద్వాల, వెలుగు: మిషన్ భగీరథ నల్లాల్లో గలీజ్  నీళ్లు వస్తున్నాయని, వాటిని ఎలా తాగాలని మల్దకల్  మండలం నాగర్ దొడ్డి గ్రామస్తులు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. రెండు నెలల నుంచి గ్రామానికి సప్లై అవుతున్న మిషన్  భగీరథ నీళ్లు మురికిగా, వాసన వస్తుండడంతో నీళ్లను తాగలేక ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మంగళవారం గ్రామస్తులు వాటర్  ట్యాంక్​ను పరిశీలించారు. 

ట్యాంక్  మొత్తం బురదమయంగా ఉండడాన్ని గుర్తించిన గ్రామస్తులు వాటిని ఫొటో తీసి, ఆ నీళ్లను తీసుకొచ్చి వీటిని ఎట్లా తాగాలని నిలదీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆఫీసర్లు, సర్పంచ్, పంచాయతీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.