
హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 75 గ్రామాలకు నాలుగు రోజులపాటు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ అభినయ్ తెలిపారు. మట్టపల్లి లో భగీరథ ఇంటెక్ వెల్ రా వాటర్ పంపింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్తగా 175 హెచ్ పీ సామర్థ్యం గల పంపులను బిగించే పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
మఠంపల్లి మండలంలో 40, హుజూర్ నగర్ మండలంలో 7, పాలక వీడు మండలంలో 15, గరిడేపల్లి మండలంలో 11, మేళ్లచెరువు మండలంలో 2 గ్రామాలకు గురువారం నుంచి ఈ నెల 6 వరకు నీరు రాదని, 7న సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు.