మిషన్ భగీరథ  కార్మికుల భిక్షాటన

జైనూర్, వెలుగు :  తమకు పెండింగ్​లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్​చేస్తూ  మిషన్ భగీరథ కార్మికులు శుక్రవారం జైనూర్ లో భిక్షాటన చేశారు . అనంతరం ఎంపీడీవో ప్రభుదయకు వినతిపత్రం అందచేశారు. నాలుగు నెలలుగా వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

 వెంటనే వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఈశ్వర్, సిద్దు, చందన్ షావ్, సత్యవాన్, నీవర్తి, కిరణ్ తదితరులున్నారు.