ఐఏఎస్ , ఐపీఎస్ పనితీరులో మార్పులకు కేంద్ర కేబినెట్ సరికొత్త నిర్ణయం
అధికారులు, ఉద్యోగుల పనితీరు మెరుగుపర్చేందుకు చర్యలు
ప్రధాని హెడ్ గా, ముఖ్యమంత్రులు సభ్యులుగా కమిటీ
వచ్చే ఐదేళ్లలో రూ.510 కోట్ల ఖర్చు
కాశ్మీర్ లో కొత్తగా మరో మూడు అధికార భాషలు
కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి జవదేకర్
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసుల్లో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలోని సవాళ్లను ఎదుర్కోవడంలో సాయపడటానికి దేశవ్యాప్తంగా సివిల్ సర్వెంట్ల కోసం ‘మిషన్ కర్మయోగి’ పేరుతో కొత్త ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. సివిల్ సర్వీసుల్లో పోస్ట్ రిక్రూట్ మెంట్ రీఫార్మ్స్ కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివరించారు. సివిల్ సర్వెంట్లు భవిష్యత్ అవసరాలకోసం ప్రిపేర్డ్గా ఉండేందుకు, ఇన్నోవేటివ్ గా పని చేసేందుకు ఈ స్కీం తోడ్పాటు అందిస్తుందన్నారు.
ప్రధాని ఆధ్వర్యంలో..
సివిల్ సర్వెంట్ల కెపాసిటీ బిల్డింగ్ కోసం జాతీయ కార్యక్రమంగా మిషన్ కర్మయోగిని ప్రభుత్వం చేపడుతోందని జవదేకర్ చెప్పారు. అధికారులు, ఉద్యోగులు తమ పనితీరును మెరుగుపరుచుకోడానికి మిషన్ కర్మయోగి కింద అవకాశం కల్పిస్తామని చెప్పారు. ప్రధాని హెడ్ గా, ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న కమిటీ.. కర్మయోగి స్కీమ్ కింద సివిల్ సర్వీసుల కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్లను ఆమోదిస్తుందని చెప్పారు. ఇది అతిపెద్ద హ్యూమన్ రీసోర్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పారు. ప్రీ రిక్రూట్ మెంట్ రీఫార్మ్స్ కోసం నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని గత కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఉద్యోగి నుంచి ఆదర్శమైన కర్మయోగిగా: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
మిషన్ కర్మయోగి పథకాన్ని ప్రధాని మోడీ సూచనలతోనే తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఉద్యోగుల పనితీరు మెరుగుపర్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ‘‘మిషన్ కర్మయోగి అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఆదర్శవంతమైన కర్మయోగిగా మార్చే ప్రయత్నం. ఉద్యోగి క్రియేటివ్ గా, నిర్మాణాత్మకంగా, చురుకుగా, టెక్నికల్ గా ఎంపవర్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది’’ అని చెప్పారు. నిరంతరంగా కెపాసిటీ బిల్డింగ్ ను పెంపొందించడానికి ఒక మెకానిజాన్ని అందిస్తుందని చెప్పారు. ఈ మిషన్ కోసం మొత్తం ఐదేళ్ల వ్యవధిలో రూ.510 కోట్లను ఖర్చు చేయనున్నట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్, ట్రైనింగ్ సెక్రెటరీ సి.చంద్రమౌళి చెప్పారు.
ఈ ప్రోగ్రాం కింద ఏంచేస్తరంటే
మిషన్ కర్మయోగి అనేది సివిల్ సర్వెంట్ల కెపాసిటీ బిల్డింగ్ కు పునాది వేసే దేశవ్యాప్త కార్యక్రమం. ఉద్యోగులు, అధికారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులను నేర్చుకుంటూనే.. మన కల్చర్ ను పాటిస్తారు.
ఇండివిడ్యువల్ (సివిల్ సర్వెంట్లు), ఇన్‌స్టిట్యూషనల్ కెపాసిటీ బిల్డింగ్ పై కర్మయోగి ఫోకస్ చేస్తుంది.
నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ (ఎన్‌పీసీఎస్‌సీబీ)గా పిలిచే ఈ మిషన్.. హ్యూమన్ రీసోర్స్ మేనేజ్ మెంట్ ను రూల్స్ బేస్డ్ నుంచి రోల్స్ బేస్డ్ గా మార్చడానికి ప్రయత్నిస్తుంది. గతంలో ఇది రూల్ స్పెసిఫిక్. ఇప్పుడు రోల్ స్పెసిఫిక్. అంతకుముందు ఇన్ స్టిట్యూషనల్ కెపాసిటీ బిల్డింగ్ అనేది లేదు. ఇప్పుడు ఉంది. అప్పడు ఇది నిరంతర ప్రక్రియ కాదు.. ఇప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటుంది.
సివిల్ సర్వెంట్లను మరింత ప్రొఫెషనల్ గా, ప్రోగ్రెసివ్ గా, శక్తివంతంగా, ట్రాన్స్‌పరెంట్‌గా, సాంకేతికంగా ఎనేబుల్ చేయడంలో సహాయపడుతుంది.
For More News..