మిషన్​ వాత్సల్య  అమలు చేయాలి

మిషన్​ వాత్సల్య  అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో తల్లిదండ్రులు లేని విద్యార్థులు, పేద విద్యార్థులు,  తమ పిల్లలను చదివించుకోలేని ఆర్థిక స్తోమత లేని విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మిషన్ వాత్సల్య' పథకంకు గత 3నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తులు స్వీకరించారు. ఆగమేఘాల మీద వేసవి సెలవులు సైతం లెక్క చేయక దరఖాస్తులు చేసిన పేద విద్యార్థులు ఆయా శాఖ అధికారులకు మండల, జిల్లాస్థాయిలో దరఖాస్తులను సమర్పించడం జరిగింది. జూన్, జులై, ఆగస్టు నెలలు గడిచిపోయినా కూడా జిల్లా కేంద్రాల్లో ఉన్న బాల భవన్ లో  జిల్లా పరిధిలోని దరఖాస్తులు అన్నీ ఒకచోట చేరి, అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. పేదరికాన్ని అధిగమించి అంబేద్కర్ అడుగుజాడలో ఉన్నత విద్యలను అభ్యసించి విద్యాపరంగా, ఆర్థికపరంగా, సామాజికపరంగా అభివృద్ధి సాధించడానికి  'మిషన్ వాత్సల్య' పథకం ఉపయోగపడుతుంది. దరఖాస్తుల స్వీకరణ తర్వాత తగిన సమాచారం దరఖాస్తుదారులకు అందడం లేదు. అధికారులు కూడా తగిన సమాచారం ఇవ్వడం లేదు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలి.- ఈదునూరి మహేష్,వరంగల్​