- తప్పు జరిగితే చర్యలు తీసుకోండి : బి. వినోద్‌కుమార్
హైదరాబాద్, వెలుగు : పెద్ద ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు చిన్నచిన్న తప్పులు జరగడం సహజమని, తప్పు జరిగిందని తేలితే చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే మేడిగడ్డ కుంగిందంటూ కాంగ్రెస్ లీడర్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినా మేడిగడ్డ ప్రాజెక్ట్‌కు ఏం కాలేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై రేవంత్ సర్కార్ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతోందని ప్రశ్నించారు. నేషనల డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) చేతిలోనే నిర్ణయం ఉందంటూ సర్కారు కాలం వెళ్లదీస్తుందని, కానీ ఎన్‌డీఎస్‌ఏ పర్మిషన్ తీసుకోవాలని డ్యామ్‌సేఫ్టీ చట్టంలో ఎక్కడా లేదన్నారు.
సర్కార్ నిర్లక్ష్యం కారణంగా వేల టీఎంసీలు నీళ్లు సముద్రం పాలై యాసంగి పంటకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎస్సారెస్పీ ఫేజ్1, ఫేజ్2కు నీళ్లు ఇవ్వలేమని ఆఫీసర్లు చెబుతున్నారని, యాసంగి పంట తక్కువ వేసుకోవాలని సూచిస్తున్నారన్నారు. ఇది పూర్తిగా సర్కారు వైఫల్యమేనని విమర్శించారు.