
తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఇందులో ముఖ్యంగా కల్కి 2898A పార్ట్ 2, సలార్ 2, స్పిరిట్, ది రాజాసాబ్, వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూనే ఇటీవలే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో మరో భారీ ప్రాజెక్ట్ అనౌన్ చేశాడు. ఇటీవలే ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకి సంబందించిన లుక్ టెస్ట్ కూడా చేశారు. ప్రభాస్ లుక్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతన్నారు.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేని సెలక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. యాక్షన్ అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ ఐతే పర్ఫెక్ట్ గా సూటవుతుందని ప్రశాంత్ వర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే భాగ్యశ్రీ బోర్సే తెలుగులో మాస మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ భాగ్యశ్రీకి ఆఫర్లు మాత్రం క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపుగా 10కి పైగా సినిమా ఆఫర్లు ఉన్నట్లు సమాచారం.
ALSO READ : Akshara Gowda: అక్షర అందమైన ఫోటో షూట్.. ఇప్పుడైనా ఆఫర్లు దక్కేనా?
ఈ విషయం ఇలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమాని ఫినిష్ చేసే పనిలో పడ్డాడు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పటికీ టెక్నికల్ కి సంబందించిన పనులు పెండింగ్ ఉండటంతో అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా. లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు మార్చ్ నెలలో 28న మ్యాడ్ స్కైర్, హరిహర వీరమల్లు, రాబిన్ హుడ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో రెండు వారాల గ్యాప్ లోన మరో పెద్ద సినిమా రిలీజ్ అంటే కమర్షియల్ గ వర్కౌట్ అవుతుందా లేదా అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని "ది రాజాసాబ్" రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.