Viral news:150 యేండ్ల నాటి MIT క్వశ్చన్ పేపర్.. సాల్వ్ చేయగలరా?

Viral news:150 యేండ్ల నాటి MIT క్వశ్చన్ పేపర్.. సాల్వ్ చేయగలరా?

ఆ ఇనిస్టిట్యూట్ ప్రపంచంలోనే నంబర్ వన్ ఇనిస్టిట్యూట్. ఇంజనీరింగ్, గణితం, సైన్స్ కు అత్యంత ప్రసిద్ధి చెందింది. అదే మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MIT). దాదాపు రెండు శతాబ్ధాలక్రితం అంటే 1861లో దీనిని స్థాపించారు. యూఎస్ కు చెందిన ఈ యూనివర్సిటీలో దాదాపు 101 మందికి పైగా నోబెల్ గ్రహీతలు, 8మంది ఫీల్డ్స్ మెడలిస్టులు ఇక్కడ చదివారు.. అందులోనే లెక్చరింగ్ కూడా చేశారు.. అంత ఫేమస్ ఈ MIT. అలాంటి ఇనిస్టిట్యూట్.. 1869లో నిర్వహించిన MIT ఎంట్రన్స్ కు సంబంధించిన ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. 

MIT Entrance Examination for 1869-1870
byu/Sans010394 inDamnthatsinteresting

అప్లయ్ చేసుకున్న అభ్యర్థుల్లో కేవలం 4 శాతం అభ్యర్థులు మాత్రమే ఈ ఇనిస్టిట్యూట్ లో ప్రవేశం పొందేవారట. ఎందుకంటే అలా ఉంటుంది మరి క్వశ్చన్ పేపర్.. అంతేకాదు. దఫాలుగా క్యాండిడేట్ ని పరీక్షించి గ్రేడ్ లు చేసి వారిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రవేశం కల్పిస్తారట. ఒక్కోసారి ఇవన్నీ పాస్ అయినప్పటికీ సీటు లభించదు. అలాంటి MIT ఎంట్రన్స్ పేపర్ ఒకటి రెడ్డిట్ లో వైరల్ అవుతోంది. 1869లో నిర్వహించిన ఎగ్జామ్ పేపర్ అది. 

MIT అల్యూమిని వెబ్ సైట్ ప్రకారం.. ఈ ఇనిస్టిట్యూట్ లో 1865 వరకు ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా ప్రవేశాలు ఉండేవట. కేవలం సంసిద్ధమై వచ్చి జాయిన్ అయ్యే వారట. ఆ తర్వాత నిర్వాహకులు టెస్ట్ లు పెట్టడం ప్రారంభించారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని వ్రాసిన పరీక్ష ప్రశ్నపత్రంలోని బీజగణిత విభాగాన్ని చూపుతున్న 1869ఎంట్రన్స్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పేపర్ లో జ్యామితి, అర్థమెటిక్, ఇంగ్లీష్ , కాలిక్యులస్‌తో సహా మరో మూడు నుండి నాలుగు విభాగాలు ఉన్నాయి. 

ఇక ఈ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ ను చూసిన నెటిజన్లు కామెంట్లు లైకులతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే  అది చాలా ఈజీగా ఉంది. అప్పుడే గనక నేనుంటే.. MIT లో సీటు గ్యారంటీ అని రాశారు. 
రెండు దశాబ్ధాల్లో మ్యాథ్స్, టెక్నాలజీ బాగా అభివృద్ది చెందాయి. టెక్నాలజీ ప్రపంచానికే మార్గదర్శనం చేస్తున్న MIT ఎంట్రన్స్ పేపర్ ఇంతర ఈజీగా చూడటం చాలా ఆనందాన్నిస్తుంది అని రాశారు మరో నెటిజన్. 
ఈ క్వశ్చన్ పేపర్ లో ఉన్న సమస్యలను ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎటువంటి కాలిక్యులేటర్ అవసరం లేదు.. ఆల్జీబ్రాపై అవగాహన ఉంటే చాలు.. చాలా వరకు కాగితంపై పెట్టుపెట్టకుండానే నోటితోనే క్వశ్చన్లకు ఆన్సర్ చేయొచ్చని.. మరో నెటిజన్ రాశారు.
 మరో నెటిజన్ హాస్యంగా ఇలా స్పందించారు.. హోలిమోలీ నేను 1869లో MIT లో చేరినట్లు అనిపిస్తుంది అని రాశారు.