క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటుగా అభిమానులకు కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లిన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. తిరిగి జట్టుతో చేరనున్నాడు. తన తాత మరణంతో పెర్త్‌కు వెళ్లిన మార్ష్ ఇక వరల్డ్ కప్ లోని ఇతర మ్యాచ్ లకు దూరం అవుతాడని అందరూ భావించారు.
కానీ ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలవడానికి తిరిగి వస్తానని మార్ష్ తన సహచరులకు చెప్పాడు. అంతేకాకుండా.. పెర్త్‌కు చేరుకున్న మార్ష్ అక్కడి విలేకరులతో మాట్లాడుతూ, టోర్నమెంట్ ముగిసేలోపు తన భార్య గ్రెటా, సోదరుడు షాన్‌లను తీసుకెళ్లే తిరిగి భారత్ కు వెళ్లాలని యోచిస్తున్నట్లు వెల్లడించాడు.
ప్రస్తుతం మార్ష్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో ఆరు మ్యాచ్‌లు ఆడిన మార్ష్.. 225 పరుగులతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. అటు ఆస్ట్రేలియా కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ ఆ తరువాత ఐదు మ్యాచులో గెలిచి 10 పాయింట్లతో టాప్ 3లో కొనసాగుతుంది. మార్ష్ రాకతో ఆ జట్టుకు మరింత జోష్ రానుంది. ఇక 2023 నవంబర్ 07న ఆఫ్ఘనిస్తాన్ తో ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ మ్యాచ్ లో మిచెల్ మార్ష్ బరిలో దిగే అవకాశం ఉంది.