భారత్ తో టీ20 సిరీస్ ఆడుతూనే ఆస్ట్రేలియా మరో సిరీస్ కు సమాయత్తమవుతుంది. స్వదేశంలో పాకిస్థాన్ తో మూడు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ జనవరి 7 న ముగుస్తుంది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించి పాక్ జట్టును ప్రకటించగా.. తాజాగా 14 మందితో కూడిన ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. ఈ స్క్వాడ్ లో వార్నర్ కు చోటు దక్కింది. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ సిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు.
2011 లో టెస్టుల్లో అరంగ్రేటం చేసిన వార్నర్ దాదాపు 12 ఏళ్ళు ఆసీస్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 37 ఏళ్ళ వార్నర్ టెస్టుల్లో 8487 పరుగులు చేసాడు. ఇందులో 25 సెంచరీలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ స్టార్ ఓపెనర్ కు ఆసీస్ గ్రాండ్ గా వీడ్కోలు పలకాలని ప్లాన్ చేస్తుంది. అయితే మాజీ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ దీనిని ఖండించాడు. వార్నర్ ఉద్దేశించి జాన్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఘనంగా విడ్కోలు పలకడానికి వార్నర్ అర్హడు కాదని జాన్సన్ అభిప్రాయపడ్డాడు.
"డేవిడ్ వార్నర్‌కు వీడ్కోలు పలికేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సిద్దమవుతోంది. టెస్టు క్రికెట్‌లో వార్నర్ దారుణంగా విఫలమవుతన్నాడు. అతని రిటైర్మెంట్ తేదీని తనే నామినేట్ చేసే అవకాశమిచ్చారు. ఆస్ట్రేలియన్ క్రికెట్ చరిత్రలో స్పాట్ ఫిక్సింగ్ చేసి వార్నర్ అతిపెద్ద కుంభకోణంలో నిలిచాడు. ఇలాంటి ఆటగాడిని ఘనంగా వీడ్కోలు పలకడానికి మీరు ఎందుకు సిద్దమవుతున్నారంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై జాన్సన్ మండిపడ్డాడు.
2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా కెప్టెన్ స్మిత్ తో పాటుగా వార్నర్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నసంగతి తెలిసిందే. దీంతో ఈ స్టార్ ఓపెనర్ పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించింది. నిషేధం తర్వాత వార్నర్ పెద్దగా రాణించడం లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో పర్వాలేదనిపిస్తున్నా.. టెస్టుల్లో ఘోరంగా విఫలమవుతున్నాడు. దీంతో వార్నర్ ఈ ఏడాది ప్రారంభంలో 2024 జనవరిలో స్వదేశంలో జరిగే చివరి టెస్ట్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తానని తెలియజేశాడు.
?️"He's still never really owned the ball-tampering scandal"
— ESPNcricinfo (@ESPNcricinfo) December 3, 2023
In his column for ?ℎ? ???? ??????????, Mitchell Johnson stated that Warner's desire for a Test farewell on his terms reeked of the same "arrogance and disrespect" as the sandpaper incident
?… pic.twitter.com/hCBVLj0rwh