పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్టార్క్ ను స్లెడ్జింగ్ చేశాడు. స్టార్క్ వేసిన ఓవర్లో తొలి మూడు బంతుల్లో ఒక బౌండరీతో సహా జైశ్వాల్ ఏడు పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత రెండు బంతులు మిస్ అవ్వడంతో వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లాయి. ఈ ఓవర్ లో స్టార్క్ వైపు చూస్తూ నీ బంతి చాలా స్లో గా వస్తుంది అని జైశ్వాల్ అన్నాడు. దీనికి స్టార్క్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక యంగ్ టీమిండియా బ్యాటర్ ఇలా ఆసీస్ బౌలర్ పై సెటైర్ వేయడం షాక్ కు గురి చేసింది.
స్టార్క్ లాంటి ఫాస్ట్ బౌలర్ ను జైశ్వాల్ స్లెడ్జింగ్ చేయడం ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ కు నచ్చలేదు. ఈ విషయంపై అతను తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. జైశ్వాల్ స్లెడ్జింగ్ చేసినప్పుడు స్టార్క్ తగ్గకుండా ఉండాల్సిందని ఈ ఆసీస్ బౌలర్ అన్నాడు. ఈ విషయంలో ఆస్ట్రేలియా మరింత దూకుడుగా వ్యవహరించాల్సిందని.. రెండు జట్ల మధ్య పోరాటాన్ని చూడాలనుకుంటుందని జాన్సెన్ అభిప్రాయపడ్డాడు.
Also Read : మూడు రోజుల్లో నాలుగు మ్యాచ్‌లాడిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఓటమి తర్వాత ఆస్ట్రేలియా ఒత్తిడిలో కనిపిస్తుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ గెలుపు అత్యంత కీలకం. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్ట్ జరగనుంది. తొలి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు శుభమాన్ గిల్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం దాదాపుగా ఖాయమైంది.