లెక్క సరిపోయింది: వార్నర్‌పై విమర్శలు.. కామెంట్రీ బాక్స్ నుంచి జాన్సన్ ఔట్

లెక్క సరిపోయింది: వార్నర్‌పై విమర్శలు.. కామెంట్రీ బాక్స్ నుంచి జాన్సన్ ఔట్

పాకిస్థాన్‌తో సిరీస్‌లో తొలి టెస్టుకు జట్టులోకి ఎంపికైన తర్వాత ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై మిచెల్ జాన్సన్ తీవ్ర విమర్శలు చేశాడు. ఇటీవలి కాలంలో టెస్టుల్లో పేలవమైన ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని వార్నర్‌కు టెస్టు జట్టులో స్థానం దక్కకుండా ఉండాల్సిందని.. అతడు 2018 లో బాల్ టాంపరింగ్ చేసాడని ఘోరంగా అవమానించాడు. జాన్సన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆస్ట్రేలియా క్రికెటర్లకు నచ్చలేదు. వార్నర్ ను సపోర్ట్ చేస్తూ జాన్సన్ పై మండిపడ్డారు. 

ఇదిలా ఉండగా తాజాగా వార్నర్ ను ఘోరంగా అవమానించిన జాన్సన్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. వస్తున్న సమాచార ప్రకారం ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ల మధ్య జరగనున్న టెస్టు సిరీస్‌కు కామెంటరీ టీమ్ నుండి ఆస్ట్రేలియన్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్‌ను తొలగించినట్లు సమాచారం. డిసెంబరు 14 నుంచి ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు తాను కామెంటరీలో భాగమని మిచెల్ జాన్సన్  తెలియజేగా.. మంగళవారం కంపెనీ విడుదల చేసిన వ్యాఖ్యాతల జాబితాలో ఈ ఫాస్ట్ బౌలర్ పేరు లేదు. 

మెవ్ హ్యూస్, వసీం అక్రమ్, మార్క్ టేలర్ వంటి దిగ్గజాల పేర్లు ఈ లిస్టులో కనిపించాయి. స్వదేశంలో పాకిస్థాన్ తో ఆస్ట్రేలియా  మూడు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ జనవరి 7 న ముగుస్తుంది. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించి పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లను ప్రకటించగా.. ప్రస్తుతం ఆస్ట్రేలియా 11 తో పాక్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ సిరీస్ తర్వాత టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు.