AUS vs IND: మైండ్ గేమ్ మొదలు పెట్టారా.. కోహ్లీ సెంచరీ కోరుకుంటున్న ఆసీస్ బౌలర్

AUS vs IND: మైండ్ గేమ్ మొదలు పెట్టారా.. కోహ్లీ సెంచరీ కోరుకుంటున్న ఆసీస్ బౌలర్

గెలవడానికి ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మైండ్ గేమ్స్ బాగా ఆడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిరీస్ కు ముందు ఆటగాళ్లను ఆకాశానికెత్తడం.. సిరీస్ ప్రారంభమైన తర్వాత స్లెడ్జింగ్ చేయడం ఆసీస్ కు అలవాటే. తాజాగా ఇప్పుడు ఆస్ట్రేలియా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అక్కడ వార్తాపత్రికల్లో విరాట్ కోహ్లీ ఫోటోను ఫ్రంట్ పేజీపై చిత్రీకరించి హైలెట్ చేశారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సెన్ విరాట్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు. 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీపై జాన్సన్ తన అంచనాలను వెల్లడించాడు. కోహ్లి ఆస్ట్రేలియా ఇదే చివరి పర్యటన అని జాన్సన్ భావిస్తున్నాడు. ఆస్ట్రేలియాలో కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉందని ఈ పర్యటనలో కోహ్లీ సెంచరీ చేస్తే చూడాలని ఉందని జాన్సెన్ చెప్పుకొచ్చాడు. కోహ్లీకి తన కెరీర్ సగటు కంటే ఆస్ట్రేలియాలో సగటు (54.08) ఎక్కువగా ఉందని.. కోహ్లీ కంబ్యాక్ ఇచ్చే క్రమంలో అతనికి ఈ సిరీస్ లో ఒత్తిడి ఉంటుందని జాన్సెన్ తెలిపాడు. 

ALSO READ : AUS vs IND: బ్లాక్ బస్టర్ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. తొలి టెస్టుకు 85 వేలమంది ప్రేక్షకులు

2014 ఆస్ట్రేలియా టూర్ లో కోహ్లీకి అద్భుతమైన రికార్డ్ ఉంది. ఈ టూర్ లో నాలుగు టెస్టుల్లోనే 692 పరుగులు చేసి ఔరా అనిపించాడు. వీటిలో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా పెర్త్ లో సెంచరీ చేశాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై  25 టెస్టు మ్యాచ్‌లు ఆడి 47.48 సగటుతో 2042 పరుగులు చేశాడు. వీటిలో 8 సెంచరీలు ఉన్నాయి. 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది.