ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో స్టార్ బౌలర్ల లిస్టులో బుమ్రా ఒకడు. మూడు ఫార్మాట్ లలో నిలకడగా రాణించే అతి కొద్ది మంది బౌలర్లలో బుమ్రా ఒకడు. తన పదునైన యార్కర్లు, స్వింగ్, బౌన్స్ తో ఎంతటి స్టార్ బ్యాటర్ నైనా బోల్తా కొట్టిస్తాడు. ప్రపంచ స్టార్ బ్యాటర్లు సైతం ఈ యార్కర్ల వీరుడిని ఎదుర్కొనడానికి ఇబ్బంది పడతారు. ఇప్పటికే క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన బుమ్రా..నెంబర్ వన్ బౌలర్ గా కితాబులందుకుంటున్నాడు. బుమ్రా బౌలింగ్ ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమే. తాజాగా ఆసీస్ స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ బుమ్రా బౌలింగ్ అంటే తనకు ఎంత భయమో చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం మార్ష్ పేలవ ఫామ్ తో కొనసాగుతున్నాడు. 33 ఏళ్ల అతను ఇటీవల స్వదేశంలో భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో మార్ష్ మాట్లాడుతూ.."నా చిన్న మేనల్లుడు టెడ్‌కి నాలుగేళ్లు. మేము ఒకరోజు పెరట్లో క్రికెట్ ఆడాము. అతను అచ్చం బుమ్రా యాక్షన్ తో బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా భయం నన్ను వెంటాడుతూనే ఉంది". అని ఈ ఆసీస్ ఆల్ రౌండర్ చెప్పుకొచ్చాడు. దీంతో అక్కడ ఉన్న ప్రేక్షకులు గట్టిగా నవ్వారు.
ALSO READ | Champions Trophy 2025: దుబాయ్‌లో టీమిండియా మ్యాచ్‌లు.. టికెట్ ధర వెల్లడించిన ఐసీసీ
మార్ష్ నాలుగు టెస్టుల్లో 47 పరుగులతో 73 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బుమ్రా బౌలింగ్ లో ఆడడంలో తడబడ్డాడు. పదే పదే బుమ్రాకు వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో చివరి టెస్టులో మార్ష్ పై వేటు పడింది. అతని స్థానంలో సెలెక్టర్లు బ్యూ వెబ్‌స్టర్‌ను చివరి టెస్టు మ్యాచ్ ఆడించారు. ఇదిలా ఉంటే మార్ష్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరమయ్యాడు. జార్జ్ బెయిలీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మార్ష్ స్థానంలో ఎవరినీ ప్రకటించలేదు. ఈ ఆల్ రౌండర్ స్థానంలో వెబ్ స్టర్ ఎంపికయ్యే అవకాశం ఉంది.
JASPRIT BUMRAH - NIGHTMARE FOR MITCHELL MARSH. 🤣🔥
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 3, 2025
- Marsh said, "my 4 year old nephew came with a Bumrah action, the nightmare continues".pic.twitter.com/evJXz7GxQ4