IPL 2024: రాష్ట్రాన్ని వదిలి ఐపీఎల్‌కే ఓటేసిన ఆసీస్ స్టార్స్

IPL 2024: రాష్ట్రాన్ని వదిలి ఐపీఎల్‌కే ఓటేసిన ఆసీస్ స్టార్స్

ప్రపంచంలో ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా ఈవెంట్ వస్తే దేశంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రపంచ క్రికెటర్లందరూ ఈ క్యాష్ లీగ్ ఆడటానికి ఆసక్తి చూపిస్తారు. ఒకరిద్దరు మినహాయిస్తే ప్రతి ఒక్కరు ఐపీఎల్ ఆడాలని కోరుకుంటారు. కొంతమంది మాత్రం దేశానికే ప్రాధాన్యత ఇచ్చి మధ్యలోనే లీగ్ వదిలేసి వెళ్తారు. కానీ ఆసీస్ స్టార్స్ మాత్రం మాకు రాష్ట్రం కన్నా ఐపీఎల్ ముఖ్యమని చెప్పకనే చెప్పారు. 

ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్లు కామెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్ ఇప్పటికే టీ20 క్రికెట్ లో తమదైన ముద్ర వేశారు. తాజాగా వీరు ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమయ్యారు. ఓ వైపు వీరి దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్‌ జరుగుతుంటే వీరిద్దరూ మాత్రం మార్చి 21 నుంచి 25 వరకు జరగబోయే ఫైనల్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే గ్రీన్, మార్ష్ ఇద్దరూ భారత్‌కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. వారు త్వరలో తమ జట్ల మొదటి మ్యాచ్‌లలో వారి సంబంధిత స్క్వాడ్ లో జాయిన్ అవుతారు.  

ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ క్యాంపెయిన్‌లో మిచెల్ మార్ష్ ఆల్ రౌండర్ గా ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్ష్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మార్చి 23న పంజాబ్ కింగ్స్‌తో క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ ఆడబోతుంది. మరోవైపు గ్రీన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడనున్నాడు. టైటిల్ కోసం వేయి కళ్ళతో చూస్తున్న ఆర్సీబీ.. ఈ ఆసీస్ ఆల్ రౌండర్ పై భారీ ఆశలే పెట్టుకుంది. మార్చి 22 న చెన్నై సూపర్ కింగ్స్ తో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్ ఆడనుంది.