న్యూఢిల్లీ : ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే నాలుగు ఓటములతో తీవ్ర ఇబ్బందిపడుతున్న ఆ టీమ్ తాజాగా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సేవలను పూర్తిగా కోల్పోయింది. తొడ కండరాల గాయం కారణంగా కారణంగా మార్ష్ మెగా లీగ్ నుంచి తప్పుకున్నాడు.
చికిత్స కోసం అతను ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిపోయాడు. టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ).. డీసీ ఫ్రాంచైజీతో మాట్లాడి మార్ష్‌ను స్వదేశానికి రప్పించినట్లు తెలుస్తోంది. గాయం వల్ల డీసీ ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ మార్ష్ బరిలోకి దిగలేదు.