తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి మినహా వరుస విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్వదేశానికి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వ్యక్తిగత కారణాల రీత్యా మార్ష్ బుధవారం(నవంబర్ 1) పెర్త్ చేరుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది.
"వ్యక్తిగత కారణాల వల్ల మిచెల్ మార్ష్ స్వదేశానికి వచ్చేశారు. తిరిగి అతను మళ్లీ జట్టుతో ఎప్పుడు కలుస్తారు అనేది ఇప్పుడే చెప్పలేం.." అని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. దీంతో మార్ష్ ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడన్నది సమాచారం.
Mitch has returned home for personal reasons and is out of the World Cup indefinitely. pic.twitter.com/jIy2LGJkcI
— Cricket Australia (@CricketAus) November 2, 2023
మార్ష్ స్వదేశానికి, మ్యాక్స్‌వెల్‌కు గాయం
ఆస్ట్రేలియా నవంబర్ 4న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కంగారూ జట్టు కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పటికే గోల్ఫ్ క్రాఫ్ట్ వాహనం నుండి కిందపడి గ్లెన్ మ్యాక్స్‌వెల్ గాయపడ్డాడు. అతను ఈ మ్యాచ్‌లో ఆడడని ఇప్పటికే ప్రకటన వచ్చింది. ఇప్పుడు మార్ష్ కూడా దూరమవ్వడం ఆస్ట్రేలియాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ 6 మ్యాచ్‌లు ఆడిన మార్ష్ 225 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉంది.
తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇండియా, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైన ఆస్ట్రేలియా.. ఆ తరువాత వరుసగా శ్రీలంక, నెదర్లాండ్స్, పాకిస్థాన్, న్యూజిలాండ్ లను చిత్తు చేసింది.ప్రస్తుతం 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
ALSO READ : ODI World Cup 2023: ప్రమాదంలో బాబర్ అజాం టాప్ ర్యాంక్.. నెంబర్ వన్‌కు చేరువలో గిల్
ఆస్ట్రేలియా తదుపరి మ్యాచ్‌లు
- నవంబర్ 4: ఇంగ్లండ్‌తో
- నవంబర్ 7: ఆఫ్ఘనిస్థాన్‌తో,
- నవంబర్ 11: బంగ్లాదేశ్ తో..