ఆస్ట్రేలియా క్రికెటర్లను కరోనా సమస్య వేధిస్తుంది. ఇటీవలే గ్రీన్, ఇంగ్లిస్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా టీ 20 కెప్టెన్ మిచెల్ మార్ష్ కరోనా బారిన పడ్డాడు. దీంతో వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదరు దెబ్బ తగిలింది. కరోనా ఉన్నప్పటికీ మార్ష్ తొలి టీ20లో ఆడనున్నాడు. ఫాక్స్ స్పోర్ట్స్‌లోని ఒక నివేదిక ప్రకారం.. మార్ష్ మొదటి T20I ఆడటానికి క్రికెట్ ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
మ్యాచ్ సమయంలో మార్ష్.. ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్ ప్రాంతాన్ని ఉపయోగిస్తాడు. అంతేకాకుండా అతను మ్యాచ్ సమయంలో తన సహచరుల నుండి కనీస దూరాన్ని పాటించాల్సి ఉంది. దీనితో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రోటోకాల్‌లకు అనుగుణంగా వేడుకలలో పాల్గొనడు. వెస్టిండీస్ తర్వాత న్యూజిలాండ్‌తో ఆసీస్ టీ20 సిరీస్ ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియా ఈ సిరీస్ లు కీలకం కానున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ..టీ20 వరల్డ్ కప్ కు మార్ష్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్ 1 నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం అవుతుంది.
Also Read: కోహ్లీని దాటేసిన రోహిత్.. టీమిండియా నెంబర్ వన్ బ్యాటర్‌గా హిట్ మ్యాన్
ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల T20I సిరీస్ ఫిబ్రవరి 9 న హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్‌లో ప్రారంభం అవుతుంది. 11 న రెండో టీ20, 13 న మూడో టీ20 జరుగుతాయి. స్టార్ పేస్ బౌలర్లు కమ్మిన్స్, స్టార్క్ ఈ సిరీస్ కు రెస్ట్ ఇచ్చారు. ఈ టూర్ లో టెస్ట్ సిరీస్ ను సమం చేసుకున్న ఆస్ట్రేలియా.. వన్డే సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
Following Travis Head, Cameron Green, and Josh Inglis, Mitchell Marsh is the latest Australian player to have been infected with the Covid-19 virus.
— CricTracker (@Cricketracker) February 8, 2024
▶️ Mitchell Marsh will be leading the side against New Zealand in the T20I series but will follow the protocols, such as… pic.twitter.com/O1pM1xDEPG