ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని హెడ్ కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు. తొడ కండరాల చికిత్స కోసం ఏప్రిల్ 12న ఆస్ట్రేలియాకు వెళ్లాడు మార్ష్... ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ తరపున నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడిన మార్ష్.. మూడు ఇన్నింగ్స్‌ల్లో 23 పరుగుల అత్యధిక స్కోరుతో 61 పరుగులు చేశాడు.
ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేసి, ఒక వికెట్ తీశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో అతను గాయపడ్డాడు. ప్రస్తుతం మూడు విజయాలు, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిదో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో కనీసం ఐదు గేమ్‌లు గెలవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.
మిచెల్ మార్ష్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరిని ఎంపిక చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక ఇప్పటికే లుంగి ఎన్‌గిడి గాయం కారణంగా ఐపీఎల్ 2024 సీజన్ కు దూరం కాగా హ్యారీ వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగాడు. డేవిడ్ వార్నర్, ఇషాంత్ శర్మలు కూడా గాయాల కారణంగా జట్టు కోసం కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యారు.
Mitchell Marsh ruled out of IPL 2024. pic.twitter.com/4tvn7tww9Z
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2024