అడిలైడ్ టెస్టులో భారత్ కు థర్డ్ అంపైర్ విలన్ లా మారాడు. మార్ష్ డిఆర్ఎస్ విషయంలో ఆస్ట్రేలియాకు అనుకూలంగా తన నిర్ణయాన్ని ప్రకటించి భారత్ కు అన్యాయం చేసినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. ఇన్నింగ్స్ 58వ ఓవర్ లో అశ్విన్ వేసిన మూడో బంతిని మార్ష్ డిఫెన్స్ చేశాడు. ప్యాడ్ లకు తగలడంతో భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు. ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అని తన నిర్ణయాన్ని తెలిపాడు. ఈ దశలో భారత్ రివ్యూ తీసుకుంది.
థర్డ్ అంపైర్ మొదట స్నికోపై స్పైక్‌ని చూసి నాటౌట్ ఇచ్చాడు. కానీ ఇది ఫస్ట్ ప్యాడ్ కు తగిలినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అంపైర్ కనీసం బాల్ ట్రాకింగ్ కూడా చూపించలేదు. కామెంటేటర్లు వార్నర్, ఫించ్ కూడా బంతి మొదట ప్యాడ్ లకు తగిలినట్టు తెలియజేశారు. థర్డ్ అంపైర్ మాత్రం ఏదో ఒక యాంగిల్ లో చూసి వెంటనే నాటౌట్ అని ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అక్కడ కనీసం ప్రొటోకాల్ కూడా పాటించలేదు. మార్ష్ లాంటి కీలక వికెట్ పడితే భారత్ ఈ మ్యాచ్ లో ముందుకెళ్ళేది. కానీ థర్డ్ అంపైర్ చెత్త నిర్ణయం వలన ఏమీ చేయలేకపోయింది.
Also Read : హెడ్, లబుషేన్ హాఫ్ సెంచరీలు.. ఆధిక్యంలోకి వెళ్లిన ఆస్ట్రేలియా
హెడ్, లబుషేన్ హాఫ్ సెంచరీలు చేయడంతో రెండో రోజు డిన్నర్ సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. క్రీజ్ లో ట్రావిస్ హెడ్ (53), మిచెల్ మార్ష్ (2) ఉన్నారు. లబుషేన్ 64 పరుగులు కెర్సి రాణించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 180 పరుగులకు ఆలౌట్ అయింది. 42 పరుగులు చేసిన నితీష్ రెడ్డి భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. జైశ్వాల్ (0), కోహ్లీ (7), రోహిత్ శర్మ (3) విఫలమయ్యారు.
Third Rate Umpiring by the 3rd Umpire. He didn’t follow the protocol, didn’t go for ball tracking. Video replay team didn’t provide the conclusive video. They did but after decision favoured Marsh. pic.twitter.com/cooKdv3rV9
— Pramod Kumar Singh (@SinghPramod2784) December 7, 2024