IND vs NZ Final: దుబాయ్ పిచ్ లాహోర్ కంటే చాలా భిన్నంగా ఉంది: న్యూజిలాండ్ కెప్టెన్

IND vs NZ Final: దుబాయ్ పిచ్ లాహోర్ కంటే చాలా భిన్నంగా ఉంది: న్యూజిలాండ్ కెప్టెన్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ ఓడిపోయింది. ఎప్పటిలాగే మరోసారి కివీస్ చేతి నుంచి ఐసీసీ టైటిల్ చేజారింది. దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9) జరిగిన ఫైనల్లో టీమిండియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో భారత్ కు పోటీనిచ్చినా అది మాత్రం సరిపోలేదు. మ్యాచ్ అంతా భారత్ చేతిలోనే ఉంది. రోహిత్, కోహ్లీ, గిల్ వికెట్లను స్వల్ప వ్యవధిలో పడగొట్టి మ్యాచ్ లో నిలిచినా అయ్యర్,అక్షర్ పటేల్ భాగస్వామ్యంతో కివీస్ వెనకపడింది. ఫైనల్లో ఓటమి తర్వాత తమ ఓటమికి ప్రధాన కారణమేంటో న్యూజి లాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ వివరించాడు. 

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అసాధారణ ఆటతీరు రెండు జట్ల మధ్య తేడా అని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు. నాలుగు వికెట్ల ఓటమిని "తీపి చేదు ముగింపు"గా అభివర్ణించాడు.ఇండియా దుబాయ్ లోని పరిస్థితులను పూర్తిగా అర్ధం చేసుకుందని.. టైటిల్ పోరులో ఓడిపోయినప్పటికీ జట్టు పట్ల తాను "గర్వపడుతున్నానని" సాంట్నర్ అన్నాడు.ఫైనల్లో మేము మంచి జట్టుతో తలపడ్డామని నేను అనుకుంటున్నాను. ఫైనల్లో భారత్ కు మేము కొన్ని సందర్భాల్లో సవాలు విసిరాము. 

దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్ లో ఆడిన లాహోర్ పిచ్ కు దుబాయ్ పిచ్ కు చాలా తేడా ఉందని.. ఈ కివీస్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. భుజం గాయంతో టైటిల్ పోరు నుంచి తప్పుకున్న తర్వాత మాట్ హెన్రీ సేవలు కోల్పోవడం తమకు అతి పెద్ద మైనస్ గా మారిందని తెలిపాడు. ఓవరాల్ గా మా జట్టు మంచి ప్రదర్శన ఇచ్చిందని నేను భావిస్తున్నాను. అని సాంట్నర్ మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు.

ఆదివారం (మార్చి 9) దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ పోటీ ఇచ్చినా భారత్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయింది. ఇండియాకు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్. అంతకముందు 2013 లో ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. 2002లో గంగూలీ కెప్టెన్సీలో  శ్రీలంకతో పాటు సంయుక్త విజేతగా నిలిచింది. ఈ మెగా ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగుల మోస్తరు స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలిచింది. భారత విజయంలో రోహిత్ శర్మ (76: 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. 48 పరుగులు చేసి అయ్యర్ రాణించాడు.