New Zealand Cricket: తాత్కాలిక కెప్టెన్‌గా సాంట్నర్‌.. వన్డే, టీ20 జట్ల ప్రకటన

వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు న్యూజిలాండ్ క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసింది. ఈ వైట్-బాల్ సిరీస్‌లకు బౌలింగ్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్‌ తాత్కాలిక కెప్టెన్‌గా నియమించబడ్డాడు.

స్టార్ క్రికెటర్లు దూరం

నవంబర్ 28 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్ వంటి స్టార్ క్రికెటర్లందరినీ పక్కన పెట్టింది. దేశవాళీ క్రికెట్‌లో స్థిరంగా రాణిస్తున్న బౌలింగ్ ఆల్ రౌండర్నాథన్ స్మిత్, బౌలర్ మిచ్ హే జట్టులో చోటు దక్కించుకున్నారు. 

Also Read :- సందీప్ రెడ్డి వంగా చెప్పిన ఒక్కమాటతో.. ట్రెండింగ్‌లోకి వచ్చేసిన ‘స్పిరిట్‌’

సిరీస్ షెడ్యూల్:

  • మొదట టీ20: నవంబర్ 09 (దంబుల్లా) 
  • రెండో టీ20: నవంబర్ 10 (దంబుల్లా) 
  • మూడో టీ20: నవంబర్ 13 (దంబుల్లా)
  • మొదటికి వన్డే: నవంబర్ 17 (పల్లెకెలె)
  • రెండో వన్డే: నవంబర్ 19 (పల్లెకెలె)

న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, విల్ యంగ్, జోష్ క్లార్క్సన్, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, జాక్ ఫౌల్క్స్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచ్ హే, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ రాబిన్సన్  (వెల్లింగ్టన్ ఫైర్‌బర్డ్స్), నాథన్ స్మిత్, ఇష్ సోధి.