Champions Trophy 2025: ఫైనల్‎కు ముందు గేమ్ ఛేంజింగ్ మూమెంట్ గురించి మాట్లాడిన సాంట్నర్

Champions Trophy 2025: ఫైనల్‎కు ముందు గేమ్ ఛేంజింగ్ మూమెంట్ గురించి మాట్లాడిన సాంట్నర్

ఛాంపియన్స్ ట్రోఫీ తుది సమరానికి చేరుకుంది. టోర్నీలో అద్భుతంగా ఆడిన భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి.       ఆదివారం (మార్చి 9) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇదే గ్రూప్ దశలో ఆడిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. భారత్, న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడడం ఇది రెండోసారి. 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియాపై న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. 

ఆదివారం జరగబోయే ఫైనల్లో భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటే.. ఐసీసీ టోర్నీల్లో భారత్ పై అద్భుతమైన రికార్డ్ ఉన్న కివీస్ టీమిండియాకు షాక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇరు జట్లు బలంగా కనిపిస్తుండడంతో ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం 2:30  ప్రారంభమవుతుంది. ఈ మెగా ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మ్యాచ్ లో కీలక అంశంపై గురించి మాటాడాడు.బుధవారం (మార్చి 5) సౌతాఫ్రికాపై 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించిన తర్వాత సాంట్నర్ భారత్ తో జరగబోయే ఫైనల్ గురించి మాట్లాడాడు.

ALSO READ : Saud Shakeel: బ్యాటింగ్‌కు రాకుండా నిద్రపోయిన పాక్ క్రికెటర్.. ఔట్ ఇచ్చిన అంపైర్

"సెమీ ఫైనల్ గెలుపు చాలా మంచి అనుభూతి. ఈ రోజు మాకు సౌతాఫ్రికా జట్టు గట్టి సవాలు విసిరింది. మేము దుబాయ్ కు వెళ్తున్నాం. దుబాయ్ వేదికగా ఇప్పటికే టీమిండియాతో మ్యాచ్ ఆడాము. భారత్ ఎలా ఆడుతుందో మాకు ఒక అంచనా ఉంది. అలాగే మాపై ఇండియాకు ఒక ఐడియా ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. టాస్ గెలవడం మ్యాచ్ కు గేమ్ ఛేంజింగ్ మూమెంట్ అవుతుంది". అని సాంట్నర్ మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్‌లో అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు టాస్ గెలవలేదు. అంతేకాదు హిట్ మ్యాన్ వరుసగా 11 సార్లు టాస్ ఓడిపోయాడు.