Australia vs India: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మాకు యాషెస్‌తో సమానం: ఆస్ట్రేలియా పేసర్

Australia vs India: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మాకు యాషెస్‌తో సమానం: ఆస్ట్రేలియా పేసర్

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ కు సుధీర్ఘమైన చరిత్ర ఉంది. 140 ఏళ్ళు దాటినా ఈ సిరీస్‌‌కు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఏటికేడు.. కొత్త వ్యూహాలు..  సరికొత్త ఆటగాళ్లతో..  ఎక్కడ తగ్గినా.. ఇక్కడ మాత్రం తగ్గేది లేదంటూ ఇరుజట్లు చేసే పోరాటానికి.. అటు ఇంగ్లిష్‌‌, ఇటు కంగారూలు ఊగిపోతారు. ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా జట్టు భారత్ తో జరగబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎక్కువ ఆదరణ ఉంటుంది. అయితే ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ మాకు ఈ రెండు సిరీస్ లు సమానమే అంటూ చెప్పుకొచ్చాడు. 

భారత్‌తో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఐదు టెస్టుల మ్యాచ్‌గా మారడంతో, ఇది తమ జట్టుకు గౌరవప్రదమైన యాషెస్ సిరీస్‌తో సమానంగా ఉంటుందని స్టార్క్ అభిప్రాయపడ్డాడు. స్టార్క్ ఈ సిరీస్ లో ప్రతి మ్యాచ్ గెలవాలని.. భారత్ ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నట్టు తెలిపాడు. టెస్ట్ ఛాంపియన్ షిప్ లో మొదటి రెండు స్థానంలో ఉన్న భారత్, ఆస్ట్రేలియా జట్లు సిరీస్ ఆడనుండడంతో అభిమానులకు ఈ మ్యాచ్ పైకి ఇస్తుందని స్టార్క్ వైడ్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్‌తో అన్నాడు. 

1991–92 తర్వాత ఇరుజట్ల మధ్య ఐదు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌గా నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో ఎక్కువగా నాలుగు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌గానే  నిర్వహించేవారు.సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది.