Mitchell Starc: టీమిండియా మాత్రమే ఒకే రోజు మూడు ఫార్మాట్‌లు ఆడగలదు: ఆసీస్ స్టార్ పేసర్

Mitchell Starc: టీమిండియా మాత్రమే ఒకే రోజు మూడు ఫార్మాట్‌లు ఆడగలదు: ఆసీస్ స్టార్ పేసర్

ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం టీమిండియా హవా నడుస్తుంది. ఫార్మాట్ ఏదైనా ఇండియాతో క్రికెట్ అంటే అన్ని దేశాలకు ఒక పెద్ద ఛాలెంజ్. చివరి రెండేళ్లలో జరిగిన అన్ని ఐసీసీ ఫార్మాట్ లలో  భారత్ ఫైనల్ కు అర్హత సాధించింది. 2023 టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకున్న భారత్ తుది సమరంలో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. ఇటీవలే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఫైనల్ కు చేరుకొని టైటిల్స్ గెలుచుకుంది. భారత జట్టు అద్భుత ప్రదర్శనపై ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ప్రశంసలు కురిపించాడు.

Also Read:-ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఆటగాళ్లు ప్రత్యేక పూజ.. కొబ్బరికాయ కొట్టిన కెప్టెన్

ఒకే రోజు మూడు వేర్వేరు ఫార్మాట్లలో మూడు వేర్వేరు జట్లు ఆడే అవకాశం ఉన్న ఏకైక దేశం ఇండియా మాత్రమే అని అన్నాడు. ఒక కార్యక్రమంలో స్టార్క్ కు ఒక ప్రశ్న ఎదురైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత క్రికెట్ వైట్-బాల్ జట్టుకు ప్రయోజనకరంగా మారిందా అనే ప్రశ్న అడిగారు. దీనికి స్టార్క్ ఈ విధంగా స్పందించాడు." ఆస్ట్రేలియాతో టెస్ట్‌,ఇంగ్లాండ్‌తో వన్డే, సౌతాఫ్రికాతో టీ20 ఒకే రోజు టెస్ట్ జట్టు, వన్డే జట్టు, టీ20 జట్టుతో ఆడగల ఏకైక దేశం ఇండియా. క్రికెట్ లో  ఇండియాలో చాలా పోటీ ఉంది. ప్రపంచ క్రికెట్ లో చాలా ఫ్రాంచైజీ లీగ్స్ ఉన్నప్పటికీ ఇండియన్ క్రికెటర్స్ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నారు. ఇది ఎంతవరకు ప్రయోజనకరమో నాకు తెలియదు". అని స్టార్క్ FanaticsTV'లో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు.

ప్రస్తుతం మిచెల్ స్టార్క్ ఐపీఎల్ 2025 సీజన్ కు సిద్ధమవుతున్నాడు. స్వల్ప గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఈ ఆసీస్ పేసర్ మరో 9 రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ కు పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతుంది గత ఏడాది కోల్ కతా తరపున ఆడిన స్టార్క్.. ప్రస్తుత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడనున్నాడు. 2024 నవంబర్‌లో జరిగిన మెగా ప్లేయర్స్ వేలంలో స్టార్క్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది.