Mitchell Starc: ఆ ఒక్క కారణంతోనే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నా: మిచెల్ స్టార్క్

Mitchell Starc: ఆ ఒక్క కారణంతోనే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నా: మిచెల్ స్టార్క్

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాల వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి  వైదొలిగిన సంగతి తెలిసిందే. అంతకముందు శ్రీలంకతో జరిగిన రెండు వన్డేల్లోనూ స్టార్క్ ఆసీస్ జట్టులో కనిపించలేదు. ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ కనిపించకపోవడంతో ఆసీస్ జట్టు బౌలింగ్ లో బలహీనంగా కనిపిస్తుంది. అయితే స్టార్క్ తాను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో అసలు విషయం చెప్పాడు. ఇంగ్లాండ్ వేదికగా జూన్ లో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ కోసం తాను సిద్ధంగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు.
 
స్టార్క్ మాట్లాడుతూ .." జట్టు నుంచి తప్పుకోవడానికి కొన్ని విభిన్న కారణాలతో పాటు వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ సమయంలో కొంచెం చీలమండ నొప్పి వచ్చింది. టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు వెస్టిండీస్ పర్యటన ఉంది. ఐపీఎల్ క్రికెట్ కూడా ఆడాలి. కానీ కానీ నా మనసులో ప్రధానంగా టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్ ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రాబోయే రెండు నెలల్లో కొంత క్రికెట్ ఆడి.. ఆపై టెస్ట్ ఫైనల్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలి". అని స్టార్క్ విల్లో టాక్ పాడ్‌కాస్ట్‌తో అన్నారు. 

ALSO READ : PSL 10: ఐపీఎల్‌తో పోటీ: పాకిస్థాన్ సూపర్ లీగ్ షెడ్యూల్ రిలీజ్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు అర్హత సాధించాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ వేదిక ఇప్పటికే ఖరారైంది. ఈ మెగా ఫైనల్ మ్యాచ్ కు తొలిసారి లార్డ్స్ వేదిక కానుంది. ఈ  ఏడాది (2025) జూన్ 11 నుంచి 15 మధ్య ఐకానిక్ లార్డ్స్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జరుగుతుందని ఐసీసీ 2024 సెప్టెంబర్ 3 న ప్రకటించింది. జూన్ 16ని రిజర్వ్ డేగా కేటాయించారు. వరుసగా మూడోసారి ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇంగ్లాండ్ లోనే జరగబోతుంది. ఇక ఐపీఎల్ లో స్టార్క్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. 2024 మెగా ఆక్షన్ లో రూ. 11.75  కోట్ల రూపాయలకు స్టార్క్ ను ఢిల్లీ దక్కించుకుంది.