
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కు అంపైర్లు బిగ్ షాక్ ఇచ్చారు. అతను క్రీజ్ దాటాకపోయినా నో బాల్ అంటూ అంపైర్లు చెప్పడంతో ఈ ఆసీస్ పేసర్ షాక్ అయ్యాడు. వాస్తవానికి స్టార్క్ ఫ్రంట్ ఫుట్ నో బాల్ వేయలేదు. అతను బ్యాక్ ఫుట్ నో బాల్ వేశాడు. బుధవారం (ఏప్రిల్ 16) రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట మ్యాచ్ టై కావడంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ కు వెళ్ళింది.
రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. సూపర్ ఓవర్‌లో మిచెల్ స్టార్క్ నాలుగో బంతిని రియాన్ పరాగ్ కు ఆఫ్-స్టంప్ అవతల లో ఫుల్ టాస్ వేయగా పరాగ్ బౌండరీ బాదాడు. అయితే ఇంతలోనే నో బాల్ సైరన్ మోగడంతో ఆన్-ఫీల్డ్ అంపైర్ నో-బాల్ సిగ్నల్ ఇచ్చాడు. రీప్లేలో స్టార్క్ చూసి ఆశ్చర్యపోయాడు. వివరణ కోసం ఆన్ ఫీల్డ్ అంపైర్ ను అడిగాడు. అంపైర్ స్టార్క్ కు ఇది ఫ్రంట్ ఫుట్ నో బాల్ కాదు.. బ్యాక్ ఫుట్ నో బాల్ అని వివరించాడు.
MCC రూల్స్ బ్యాక్‌ఫుట్ నో-బాల్స్ గురించి ఏమి చెబుతుంది?
MCC రూల్ 21.5 ప్రకారం.. బంతిని డెలివరీ చేసేటప్పుడు బౌలర్ యొక్క బ్యాక్ ఫుట్ రిటర్న్ క్రీజ్‌ను తాకకూడదు లేదా దాటకూడదు. లైన్‌తో స్వల్పంగా తాకినా కూడా నో-బాల్‌గా పరిగణించబడుతుంది. స్టార్క్ బంతిని డెలివరీ చేస్తున్న సమయంలో అతని బ్యాక్ ఫుట్ రిటర్న్ క్రీజ్‌ను తాకినట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో థర్డ్ అంపైర్ నో బాల్ ఇవ్వాల్సి వచ్చింది.
►ALSO READ | Gensol Stock: ధోనీకి భారీ నష్టం.. కెప్టెన్ కూల్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన జెన్సోల్ స్టాక్..
స్టార్క్ నో బాల్ వేసినా సూపర్ ఓవర్ లో అతను రాజస్థాన్ రాయల్స్ ను 11 పరుగులకే పరిమితం చేశాడు. అంతకముందు ఛేజింగ్ చేస్తున్న సమయంలో చివరి ఓవర్ వేస్తున్నప్పుడు 9 పరుగులు కావాల్సిన దశలో స్టార్క్ తన అద్భుతమైన బౌలింగ్ తో 8 పరుగులే ఇచ్చి మ్యాచ్ ను టై చేశాడు. సూపర్ ఓవర్ థ్రిల్లర్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్ లో మొదట ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై గా ముగిసింది. సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 11 పరుగులు మాత్రమే చేయగలిగింది. 12 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఒక రెండు బంతులు మిగిలి ఉండగానే థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. సూపర్ ఓవర్ లో రాహుల్ ఫోర్ కొట్టగా.. స్టబ్స్ సిక్సర్ కొట్టి మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. స్టార్క్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
NO BALL!
— Cricket Addiction (@CricketAdd1ct) April 16, 2025
It's not for FRONT FOOT! It's BACK FOOT NO BALL!
STARC Can't Believe It!#MitchellStarc #NoBall #SuperOver #DCvsRR #ipl2025 #cricketaddiction pic.twitter.com/P6GfUqTbhz