ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కు ఐపీఎల్ 2024 మినీ వేలంలో 24.75 కోట్ల భారీ ధరకు కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఒక విదేశీ బౌలర్ కు అంత భారీ మొత్తం చెల్లిచడంతో కోల్ కతా ఫ్రాంచైజీపై చాలా మంది క్రికెట్ ఎక్స్ పర్ట్స్, ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా స్టార్క్ అందరి అభిప్రాయాలను తలక్రిందులు చేసాడు. క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన బంతితో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫిక్ ను బోల్తా కొట్టించాడు.
సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఈ రోజు(జనవరి 6) ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో పాక్ పై గెలిచి టెస్ట్ సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ లో పాక్ రెండో ఇన్నింగ్స్ కు బ్యాటింగ్ దిగిన సమయంలో తొలి ఓవర్లో స్టార్క్ అద్భుతమైన ఇన్-స్వింగింగ్ డెలివరీకి అబ్దుల్లా షఫిక్ ను వెనక్కి పంపాడు. సాధారణంగా ఓవర్ ది వికెట్ సైడ్ బౌలింగ్ చేసినప్పుడూ ఇన్-స్వింగింగ్ డెలివరీ వేయడం మనం చూస్తాం. కానీ స్టార్క్ అరౌండ్ ది వికెట్ వైపు వస్తూ ఇన్-స్వింగింగ్ డెలివరీ వేయడంతో ఒక్కసారిగా అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్ధం కాలేదు.
బ్యాటర్ తో పాటు కామెంటేటర్స్ అందరూ షాక్ అయ్యారు. 143.5kph వేగంతో విసిరిన ఈ బంతి పిచింగ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వైపు లైన్ మీద పడి అనూహ్యంగా లోపలికి తిరిగింది. బ్యాట్, ప్యాడ్ల మధ్య వేగంగా లోపలి వెళ్లిన బంతి వికెట్లను గిరాటేసింది. ఈ టాప్ డెలివరీపై కామెంటేటర్లు ఇయాన్ స్మిత్, హర్ష భోగ్లే, మైకేల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించారు. స్టార్క్ తీసిన ఈ వికెట్ టెస్ట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది.
PEACH! ?
— cricket.com.au (@cricketcomau) January 5, 2024
Mitch Starc does it again! pic.twitter.com/9OQ1bTeO1G