ఆంధ్ర క్రికెట్‌కు సేవలు అందించనున్న మిథాలీ రాజ్

ఆంధ్ర క్రికెట్‌కు సేవలు అందించనున్న మిథాలీ రాజ్

భారత మాజీ మహిళా క్రికెటర్‌, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ కొత్త బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళా క్రికెట్‌ ఆపరేషన్స్‌ మెంటార్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఏసీఏ కార్యదర్శి ధ్రువీకరించారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించడం, వారిని మెరికల్లా తీర్చిదిద్దడం ఆమె విధి. ఈ ఒప్పందం మూడేళ్లు కొనసాగనుంది. 

ALSO READ | IPL 2025: బోర్డర్, గవాస్కర్ కంటే కంటే SRH ముఖ్యం.. మెగా ఆక్షన్ కోసం భారత్‌కు ఆసీస్ కోచ్

"మహిళా క్రికెటర్ల కోసం అనంతపురంలో పూర్తి స్థాయి హై పెర్ఫార్మెన్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాం. మొదట వివిధ వయస్సుల వారీగా 80 మందిని ఎంపిక చేయనున్నాం.. వీరికి మిథాలీ రాజ్‌ సంరక్షణలో365 రోజుల శిక్షణ ఇస్తాం.." అని ఏసీఏ సెక్రటరీ సతీష్ బాబు తెలిపారు. ఇదిలావుంటే, పురుష క్రికెటర్ల కోసం విజయనగరంలో హై పెర్ఫామెన్స్ అకాడమీ నిర్మించనున్నట్లు ఏసీఏ సెక్రటరీ వెల్లడించారు.