రూ.8,485 కోట్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ షేర్లు అమ్మిన ఐసీఐఎల్‌‌‌‌‌‌‌‌

రూ.8,485 కోట్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ షేర్లు అమ్మిన  ఐసీఐఎల్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:  ప్రమోటర్ కంపెనీ  ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ (ఐసీఐఎల్‌‌‌‌‌‌‌‌)  సుమారు రూ.8,485 కోట్ల విలువైన ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ షేర్లను మంగళవారం అమ్మింది. ఈ టెలికం కంపెనీలో 0.84 శాతం వాటా (5.11 కోట్ల షేర్లు) ను బ్లాక్‌‌‌‌‌‌‌‌ డీల్ కింద విక్రయించింది. ఈ షేర్లలో 1.20 కోట్లను  భారతీ టెలికం లిమిటెడ్ కొనుగోలు చేసింది. 

ఐసీఐఎల్ అమ్మిన మొత్తం షేర్లలో ఇవి 24 శాతానికి సమానం. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌లో భారతీ టెలికం ప్రధాన ప్రమోటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాగా, ఐసీఐఎల్‌‌‌‌‌‌‌‌, పాస్టెల్‌‌‌‌‌‌‌‌  లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ ప్రమోటర్ గ్రూప్ కంపెనీలుగా ఉన్నాయి. ఐసీఐఎల్‌‌‌‌‌‌‌‌కు 3.31 శాతం వాటా,   పాస్టెల్‌‌‌‌‌‌‌‌కు 9.50 శాతం వాటా ఉంది.  ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌‌‌‌‌లో భారతీ టెలికంకు 40.47 శాతం వాటా ఉంది.