బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలి : మిట్టపల్లి వెంకటస్వామి

బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని సింగరేణి యాజమాన్యం పూర్తిస్థాయిలో నడిపించేలా చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేశ్ డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం బెల్లంపల్లి ఏరియా జీఎం రవి ప్రసాద్​కు వినతిపత్రం అందజేశారు.

ఆసుపత్రిని యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని, అన్ని రకాల వైద్యనిపుణులను నియమించాలని, 40 వేల మంది కార్మికులకు వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య, బ్రాంచ్ కోశాధికారి నాగేశ్వరరావు, ఏరియా హాస్పిటల్ ఫిట్ సెక్రటరీ డీఆర్ శ్రీధర్, అసిస్టెంట్ సెక్రటరీ పుట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.