హైదరాబాద్, వెలుగు: వైర్‌లెస్ ఆడియో సొల్యూషన్స్ అందించే మివీ, తమ సరికొత్త ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ ఒపెరాను అందుబాటులోకి తెచ్చింది. చిన్నచిన్న ధ్వనులను సైతం దీంతో స్పష్టంగా వినవచ్చు. ఒకసారి ఛార్జ్‌తో 60 గంటల వరకు పనిచేస్తుంది.
10 మీటర్ల వరకు లాస్‌లెస్ ఆడియోని ఆస్వాదించవచ్చని, ఒకేసారి రెండు పరికరాలతో కనెక్ట్ చేయవచ్చని మివీ తెలిపింది. వీటి ఆఫ్ లైన్ ధరలు రూ. 2,199 నుంచి ప్రారంభం అవుతాయి.