
- ఆలస్యంగా వెలుగులోకి..
మియాపూర్, వెలుగు: ఐడీ కార్డు అడిగితే చూపించకుండా సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడిన జెప్టో డెలివరీ బాయ్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. మియాపూర్మై హోం జ్యూవెల్అపార్ట్మెంట్ లో ఆదివారం రాత్రి జెప్టో ఆర్డర్ డెలివరీ చేసేందుకు బాయ్సాగర్వెళ్లాడు. అతడు ఐడీ కార్డు చూపించకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ విషయమై సాగర్ వాట్సాప్ గ్రూప్‌లో మెస్సేజ్పెట్టడంతో క్షణాల్లో పదుల సంఖ్యలో డెలివరీ బాయ్స్అక్కడికి చేరుకొని, హంగామా చేశారు. అపార్ట్‌మెంట్‌వాసులు, సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగారు.
పోలీసులు వచ్చి, నిందితులు సాగర్, అశోక్, గోవిందరాజు, సాయికుమార్, నరేందర్, డెవిల్లను అదుపులోకి తీసుకున్నారు. అపార్ట్‌మెంట్‌వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డెలివరీ బాయ్స్ మద్యం మత్తులో వచ్చి, అసభ్యకరంగా ప్రవర్తించారని అపార్ట్మెంట్ప్రెసిడెంట్ మహేశ్తెలిపారు. డెలివరీ బాయ్స్‌కు ఆయా సంస్థలు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని
కోరారు.