మియాపూర్, వెలుగు : అరకు నుంచి నగరానకి గంజాయి తీసుకువచ్చి మరో ప్రాంతానికి వెళ్లే యత్నంలో ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 6.5 కిలోల గంజాయిస్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ సీఐ క్రాంతి కుమార్ కథనం ప్రకారం..నాగర్ కర్నూల్ జిల్లా ఇంద్రకుల గ్రామానికి చెందిన ఇంద్ర కుమార్ (27) అరకులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రన్ చేస్తున్నాడు.
అక్కడి నుంచి ఎండు గంజాయి తీసుకువచ్చి హైదరాబాద్‌తో పాటు సొంతూరిలో అమ్మేందుకు ప్లాన్వేశాడు. గంజాయితో హైదరాబాద్ వచ్చి మళ్లీ సొంతూరు వెళ్తుండగా మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో పిల్లర్ 603 దగ్గర మాదాపూర్ ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు పట్టుకున్నారు. 6.5 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇంద్ర కుమార్ గతంలో అల్వాల్ పీఎస్‌లో గంజాయి కేసులో పట్టుబడి ఏడాది పాటు జైలుకు వెళ్లి వచ్చాడు.