ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి..21 కేజీల గంజా సీజ్

ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి..21 కేజీల గంజా సీజ్
  •     ముగ్గురు అరెస్ట్ 

మియాపూర్, వెలుగు : ఒడిశా నుంచి హైదరాబాద్​కు గంజాయి తీసుకొస్తున్న ముగ్గురిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారంతో బుధవారం మియాపూర్ మెట్రో స్టేషన్​వద్ద సైబరాబాద్​ఎస్​వోటీ పోలీసులతో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు.

మహీంద్రా జైలో వాహనంలో 21 కేజీల సరుకును గుర్తించారు. దీంతో కారులోని ఒడిశాకు చెందిన లిమ్మ శ్రీకాంత్​, మహదేవ్, గుంటూరుకు చెందిన నాగిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.