6 కేజీల గంజాయి పట్టివేత..ఐదుగురు అరెస్ట్

6 కేజీల గంజాయి పట్టివేత..ఐదుగురు అరెస్ట్

మియాపూర్, వెలుగు : అరకు నుంచి గంజాయి తెచ్చి అమ్ముతున్న ఇద్దరిని మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మియపూర్ ఇన్​స్పెక్టర్​ రామలింగప్రసాద్ కథనం ప్రకారం..విజయవాడకు చెందిన సంతోష్ (26), సూర్యాపేటకు చెందిన రాహుల్ అభిషేక్ (21) ఇద్దరు మియపూర్ న్యూ కాలనీలో ఉంటున్నారు.  

వీరు ఏపీలోని అరకు నుంచి  తక్కువ ధరకు గంజాయిని కొని తెచ్చి మియాపూర్ లోని మయూరినగర్ ఏఆర్కే టవర్స్ వద్ద అమ్మేందుకు యత్నిస్తున్నారు. సమాచారం అందడంతో  మియాపూర్ పోలీసులు వెళ్లి సంతోష్ , రాహుల్ అభిషేక్ లను అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ పై గతంలో గంజాయి స్మగ్లింగ్ కేసు నమోదైంది. ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ధూల్​పేటలో..

మెహిదీపట్నం : ధూల్​పేట ఆపరేషన్ లో భాగంగా 1.07 కేజీల గంజాయిని పట్టుకొని ఇద్దరిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ సూపరిండెంట్ ఎస్టీఎఫ్  టీం లీడర్ ఎన్. అంజిరెడ్డి తెలిపారు. ధూల్ పేట లోథా భవన్ నుంచి హజారి హోటల్ మధ్య ఆదివారం వాహనాల తనిఖీలు చేపట్టారు. అప్పల్ ధూల్ పేట్​కు చెందిన నవీన్ సింగ్, గౌతమ్ సింగ్ స్కూటీపై గంజాయిని తీసుకెళ్తున్నట్టు సమాచారం అందింది. 

 వారిని ఆపి చెక్ చేయగా గంజాయి దొరికింది. ఎనిమిది మంది వద్ద 30 గ్రాములకు రూ.1500 చొప్పున డబ్బులు తీసుకొని ఇచ్చేందుకు వెళ్తున్నట్టు నిందితులు తెలిపారు. ధూల్ పేట ఎక్సైజ్ సీఐ గోపాల్, ఎస్ టీ ఎఫ్ ఎస్ సిబ్బంది భాస్కర్ రెడ్డి, శ్రీధర్, అజిత్ ప్రకాష్, రాకేష్రా,రాహుల్ ప్రభు ఉన్నారు.

200 గంజాయి చాక్లెట్లు సీజ్​ 

జీడిమెట్ల : కిరాణ షాపులో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని మేడ్చల్​ ఎస్వోటీ, పేట్​బషీరాబాద్​పోలీసులు అరెస్ట్​ చేశారు. యూపీకి చెందిన పివేశ్​పాండే (32) ​  బతుకుదెరువుకు సిటీకి వచ్చి సుభాశ్​పరిధి భాగ్యలక్ష్మీకాలనీలో  కోమల్​ కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. ఈజీ మనీ కోసం అలవాటు పడి యూపీలోని ప్రయాగ్​రాజ్​ అనే వ్యక్తి నుంచి గంజాయి చాక్లెట్లు తెచ్చి కార్మికులు, ఇతరులకు అమ్ముతుడున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం పోలీసులు  కిరాణ షాపుపై  దాడి చేసి 5 ప్యాకెట్లలోని 200 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.  నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.