బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో కీలక మలుపు.. 19 మంది బెట్టింగ్‌ యాప్‌ల ఓనర్లపై కేసులు నమోదు

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో కీలక మలుపు.. 19 మంది బెట్టింగ్‌ యాప్‌ల ఓనర్లపై కేసులు నమోదు

హైదరాబాద్: బెట్టింగ్‌ యాప్స్‌ కేసు కీలక మలుపు తిరిగింది. 19 మంది బెట్టింగ్‌ యాప్‌ల ఓనర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మియాపూర్ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. 19 మంది బెట్టింగ్‌ యాప్‌ల ఓనర్లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. యాప్‌ల యజమానులే లక్ష్యంగా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. యాప్ నిర్వాహకులపై కొత్త సెక్షన్స్ నమోదు చేయాలని భావిస్తున్నారు. యాప్ ప్రమోషన్స్ చేసిన వాళ్ల స్టేట్మెంట్ రికార్డు చేయాలని పోలీసులు నిర్ణయించారు.

బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీస్​స్టేషన్లో కేసు నమోదైన 11 మంది విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం వరకు టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూ చౌదరిని విచారించగా, సోమవారం నటి, యాంకర్ శ్యామల స్టేషన్లో అధికారుల ఎదుట హాజరైంది. ఇప్పటికే విచారణకు హాజరైన విష్ణుప్రియ, రీతూ చౌదరి ఈ నెల 25న మళ్లీ ఎంక్వైరీకి రానున్నారు. వీరితో పాటు సన్నీ, అజయ్, సుధీర్ ఎప్పుడైనా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్​ ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని సమాచారం. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిసింది. 

ALSO READ | గంజాయిని జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దాకా తీసుకొచ్చారు.. కారులో 115 కేజీలు దొరికింది..!

అటు మియాపూర్ పోలీస్​స్టేషన్​లో నమోదైన కేసులో విజయ్​దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్​రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, అనన్య నాగళ్ల, శోభా శెట్టి, సిరి హన్మంతు, శ్రీముఖి సహా పంజాగుట్ట పీఎస్​లో విచారణ ఎదుర్కొంటున్న 11 మందిపైనా కేసు నమోదు కాగా, ఈ ఎంక్వైరీ ఇంకా మొదలుకాలేదు. మొదట బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మీడియేటర్లను విచారించిన తర్వాత సెలబ్రిటీలను విచారణకు పిలుస్తారని సమాచారం.