న్యూఢిల్లీ, వెలుగు: మిజోరం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్ గా నియమితులయ్యారు. మంగళవారం ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఒడిశా గవర్నర్ పదవికి రఘుబర్ దాస్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ను బిహార్ కు.. బిహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ను కేరళకు బదిలీ చేశారు. మణిపూర్ గవర్నర్ గా అజయ్ కుమార్ భల్లాను, మిజోరం గవర్నర్ గా జనరల్ వీకే సింగ్ ను రాష్ట్రపతి నియమించారు.