గురుకుల పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి

రంగారెడ్డి జిల్లా బాట సింగారంలోని మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల హాస్టల్లో రంజిత్ అనే 8వ తరగతి విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. రంజిత్ అనే బాలుడు హాస్టల్ లో ఉరేసుకుని చనిపోయాడు. అయితే బాలుడి మృతిపై  కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బాలుడు ఉరి వేసుకున్నట్లు సృష్టించారని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. స్యూల్ హాస్టల్ ముందు బాలుడి కుటుంబసభ్యులు, గ్రామస్థులు బైఠాయించారు. మృతి చెందిన విద్యార్థి స్వస్థలం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామం.

ALSO READ:ఏపీలో రూ. 10 వేల ఇస్తే ..తెలంగాణలో రూ. 7వేలే..

రంజిత్ మృతిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించాలని.. విద్యార్థి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే నాలుగు గంటలుగా ఆందోళన చేస్తున్నా.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు స్పందించడం లేదని మండిపడుతున్నారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండానే బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.