One Nation One Election: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు క్రూరమైనది.. రాష్ట్రాల గొంతు చంపేయటమే : సీఎం స్టాలిన్

 One Nation One Election: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు క్రూరమైనది.. రాష్ట్రాల గొంతు చంపేయటమే : సీఎం స్టాలిన్

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ కు కేంద్ర కేబినెట్  ఆమోదంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. వన్ నేషన్..వన్ ఎలక్షన్ బిల్లు చాలా క్రూరమై నది..ఇది చట్టంగా మారితే రాష్ట్రాల గొంతునను నొక్కుతుంది. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది..రాష్ట్రా పాలనకు విఘాతం కలిగిస్తుందన్నారు ఎంకే స్టాలిన్. ప్రజా స్వామ్యంపై జరుగుతున్న ఈ దాడిని అందరూ ప్రతిఘటించాలని కోరారు. 

గురువారం (డిసెంబర్ 12)  వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఈ బిల్లు మొదటి జెపీసికి పంపనున్నారు. ఆ తర్వాత ఈ సీతా కాల సమావేశాల్లోనే పార్లమెంట్ ప్రవేశపెట్టే యోచనలో ఎన్డీయే సర్కార్ ఉంది.. దీంతో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానం చర్చనీయాంశంగా మారింది.

గత సెప్టెంబర్ జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో  వన్ నేషన్ .. వన్ ఎలక్షన్  ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.మొదట దశగా పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు, 100 రోజుల తర్వాత జనరల్ బాగీ ఎలక్షన్లు జరపాలని  లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందుకోసం మాజీ రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ నేతృ త్వంలో ఓ కమిటినీ వేసింది.  కాగా బుధవారం రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదిక ను సమర్పించింది.

కమిటీ నివేదిక సమర్పణ సమయంలో రామ్ నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యాలు చేసింది.వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానం  ఏ రాజకీయ పార్టీ ప్రయోజనాలకోసం కాదు.. దేశ ప్రయోజలనాలకోసమని అన్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానం అమలు తర్వాత దేశ జీడపీ 1నుంచి 1.5 శాతం పెరుగుతందని అన్నారు.. ఇది స్వయంగా దేశ ఆర్థిక వేత్తలే చెబుతున్నారని రామ్ నాథ్  కోవింద్ అన్నారు.

వన్ నేషన్..వన్ ఎలక్షన్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులనుంచి స్పందనవస్తున్నాయి.. వన్ నేషన్ వన్ ఎలక్షన్  విధానం ప్రాంతీయ పాలనను దెబ్బతీస్తుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అంటుండగా.. తరచుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజానిధులు, సమయం వృధా అవుతున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వాదిస్తున్నారు.