భైంసా, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ అక్రమాలపై త్వరలో విజిలెన్స్ ఎంక్వయిరీ చేయిస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం బాసర ట్రిపుల్ ఐటీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టూడెంట్ల హాస్టల్ గదులను పరిశీలించారు. గదులు, బాత్రూంలు శుభ్రంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని స్టూడెంట్లకు ధైర్యం చెప్పారు.
ఇష్టపడి చదివి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయమన్నారు. నిబంధనల ప్రకారం స్టూడెంట్లకు భోజనం అందించకపోతే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. దాదాపు 3 గంటల పాటు ట్రిపుల్ ఐటీలో తిరిగారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట బాసర మండల నాయకులు సామల రమేశ్, విశ్వనాథ్, బిద్దుర్ రమేశ్, సాయినాథ్, వెంకట్రావు పటేల్ తదితరులున్నారు
Also Read : ఎల్వీఆర్ షాపింగ్ మాల్ ప్రారంభ వేడుకల్లో సినీ నటి నేహా శెట్టి