బీఆర్ఎస్ వీడుతున్నారన్న ప్రచారాన్ని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కొట్టిపారేశారు. ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్ ను వీడేది లేదన్నారు. నియోజకవర్గంలో మెజారిటీ నేతలు తన వెంటనే ఉన్నారని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తనకే బీఫారం ఇస్తారని ఎమ్మెల్యే అబ్రహం ధీమా వ్యక్తం చేశారు. బీఫారమ్ ఇవ్వడంలో కొంత ఆలస్యం అవుతుందని..సీఎం కేసీఆర్ అభ్యర్థులకు విడతల వారీగా బీఫారాలు ఇస్తున్నారని చెప్పారు.
ALSO READ : తెలంగాణలో 30 సీట్లు అయినా ఇవ్వాలి : బీజేపీతో జనసేన
ఇటీవల బీఆర్ఎస్ లో చేరిన వారు ఎమ్మెల్యే కావాలని కలలు కంటున్నారని..అందుకే తనకు వ్యతిరేకంగా సమావేశాలు పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అబ్రహం. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనకే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫారమ్ ఇస్తానని ప్రకటించినా..కొందరు తనకు వ్యతిరకంగా పనిచేస్తున్నారని చెప్పారు.