అలంపూర్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ అపోహలకు గురికావొద్దని ఎమ్మెల్యే అబ్రహం సూచించారు. మంగళవారం ఉండవల్లి మండల కేంద్రంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ కోసం పని చేయాలని కోరారు. కేసీఆర్ పై తనకు నమ్మకం ఉందని, బీఫామ్ తనకే ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రలోభాలకు గురి కావద్దని సూచించారు. కొందరు కావాలని పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడే ప్రసక్తే లేదని తెలిపారు. ఎంపీపీ బీసమ్మ, వైస్ ఎంపీపీ దేవన్న, జడ్పీటీసీ కాషపోగు రాజు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు లోకేశ్వర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రమణ, ఎంపీటీసీలు కురుమూర్తి, రాజశేఖర్ , సుంకన్న , ఉప సర్పంచ్ మక్బూల్మియా పాల్గొన్నారు.