వేములవాడ, వెలుగు : వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో కొత్త సబ్ స్టేషన్లతోపాటు, అప్ గ్రేడ్ చేసేందుకు కృషి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. ఆదివారం హైదరాబాద్ లో డిప్యూటీ సీఎంను కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. వేములవాడ రూరల్
అర్బన్ మండలాల పరిధిలోని నూకలమర్రి, రుద్రవరం గ్రామాల్లో కొత్తగా 33/11 కేవీ సబ్ స్టేషన్లు, రుద్రంగి మండల కేంద్రం, నేరెళ్ల, చందుర్తి మండలం జోగాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద గల సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని కోరారు. దీనికి భట్టి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వర్గాలు తెలిపారు.