
వేములవాడ, వెలుగు : మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో సోమవారం ఎంఏ నసీర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో
ఆయన పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు. విందులో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేశ్, పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మన్నాన్, రియాజ్ పాల్గొన్నారు.