
చందుర్తి, వెలుగు: చందుర్తి మండలం అసిరెడ్డిపల్లి అనుబంధ గ్రామం గొల్లపల్లిలో సోమవారం బీరప్ప కామరాతి కల్యాణం ఘనంగా నిర్వహించారు. కల్యాణంలో విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ గొల్ల కురుమల ఆరాధ్య దైవం బీరయ్య కమరాతి కల్యాణంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, మాజీ జడ్పీటీసీ నాగం కుమార్, లీడర్లు రాంరెడ్డి, ముకుంద రెడ్డి, ప్రభాకర్, యాదవ కులస్తులు పాల్గొన్నారు.