హరీష్ రావుది చిట్ చాట్ కాదు.. సోది చాట్.. విప్ శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్

హరీష్ రావుది చిట్ చాట్ కాదు.. సోది చాట్.. విప్ శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్

హైదరాబాద్:  సీఎం రేవంత్ రెడ్డిది చిట్ చాట్ కాదని.. చీప్ చాట్ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావుది చిట్ చాట్ కాదని.. సోది చాట్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చీప్ పాలిటిక్స్‎కు హరీష్ రావు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ అక్రమ కట్టడాలు కూల్చేస్తే బీఆర్ఎస్ నేతలకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. చెరువును అక్రమంగా ఆక్రమించి హీరో నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను హరీష్ రావు స్వాగతిస్తున్నారా లేదా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా నిబంధల ప్రకారమే నడుస్తోందని అన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. 

ALSO READ | ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

కాగా, గత కొన్ని రోజులుగా స్టేట్ పాలిటిక్స్‎లో హైడ్రా హాట్ టాపిక్‎గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు,  కుంటలు అక్రమణలకు గురి కాకుండా.. ఇప్పటి వరకు కబ్జాకు గురిన వాటిని రక్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా హైడ్రా దూకుడుగా పని చేస్తోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ నేల మట్టం చేస్తోంది. సామ్యానులు, సెలబ్రెటీలు అనే తేడా లేకుండా కట్టడాలు ఇల్లీగల్ అనే తేలితే చాలు ఘటన స్థలంలో వాలిపోయి.. అక్రమ కట్టడాలను కూల్చి పడేస్తున్నారు హైడ్రా అధికారులు, సిబ్బంది. దీంతో హైడ్రా అధికార, ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్‎కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‎గా మారింది.