శివరాత్రి జాతరకు రావాలని సీఎంకు ఆహ్వానం

శివరాత్రి జాతరకు రావాలని సీఎంకు ఆహ్వానం

వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు రావాలని సీఎం రేవంత్​రెడ్డిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ ఆహ్వానించారు. మంగళవారం హైదరాబాద్​లో సీఎంను కలిశారు. ఆలయ ఈవో వినోద్​రెడ్డి రాజన్న ప్రసాదం  అందజేయగా, అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జాతరలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు  చేయాలని ఆదేశించారు. భక్తులకు అవసరమైన సౌలతులు కల్పించాలని సూచించారు.

 రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై సీఎం ఆరా తీశారు. పనులు టెండర్  దశలో ఉన్నాయని వివరించగా, జాప్యం చేయకుండా విస్తరణ పనులను స్పీడప్​ చేయాలని సూచించారు. రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా భూసేకరణ కోసం నిధులు విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్  గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యే లను కలిసి ఆహ్వానించారు.