
కోనరావుపేట,వెలుగు: వడగళ్లవానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం ఎగ్లాస్‌పూర్ గ్రామంలో కురిసిన వానలతో దెబ్బతిన్న పంట పొలాలను మంగళవారం ఆయన పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ
జగిత్యాల రూరల్, వెలుగు: దేశంలోనే కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీత విద్యాలయం గ్రౌండ్ లో గంగపుత్ర భీష్మ క్రికెట్ ట్రోఫీని ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో స్నేహ భావం, మానసికోల్లాసం
కలుగుతాయన్నారు.