వేములవాడ, వెలుగు: వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీకి నిధులు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను విప్‌లు, వేములవాడ, ధర్మపురి ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, అడ్లూరిలక్ష్మణ్‌కుమార్ కోరారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలైన నేపథ్యంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో గల్ఫ్ కార్మికుల సమస్యలను విన్నవించగా వారు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు.
రాజన్నఉద్యోగుల బదిలీలు ఆపండి
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉద్యోగుల బదిలీలు వెంటనే ఆపాలని విప్‌లు ఆది శ్రీనివాస్, రాంచంద్రునాయక్, బీర్ల అయిలయ్యను సంఘం నాయకులు కోరారు. మంగళవారం రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సిరిగిరి శ్రీ రాములు నేతృత్వంలో హైదరాబాద్‌లో వారిని కలిసి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనారోగ్య సమస్యలు, పిల్లల చదువులు, ఇతరత్రా సమస్యలున్నాయని రాజన్న ఆలయ ఉద్యోగుల బదిలీలపై పునరాలోచించాలని కోరారు. ఉద్యోగులు నటరాజు, నాగుల మహేశ్, గుండి నరసింహమూర్తి , ఎడ్ల శివ, సురేశ్, గడ్డం రాజేందర్, నక్క తిరుపతి ఉన్నారు.